Prabhu

Prabhu is a journalist and contributor at Voice of Bhagyanagar, covering local news, civic issues, public interest stories, and developments across Hyderabad and Telangana. With a focus on accuracy and people-first reporting, Prabhu brings timely and trustworthy updates to the community.

ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన నరేంద్ర మోదీ

సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్లను దాటిన ప్రపంచ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరిగా నిలిచారు. డిజిటల్ మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగిస్తూ, దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వంటి అంశాలను సోషల్ మీడియా వేదికగా ముందుకు తీసుకెళ్తూ ప్రధాని మోదీ విశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేశ ప్రజలతోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోనూ అనుసంధానం కొనసాగిస్తూ, భారత…

Read More

పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు…బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సౌకర్యం

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆధార్‌ వివరాల అప్‌డేషన్‌కు తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్‌ 2026 నాటికి 100 శాతం ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పాఠశాలలలోనే ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు బయట కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్కూల్‌ ప్రాంగణంలోనే ఈ సేవలు పొందేలా చర్యలు చేపట్టారు. 5 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు, అలాగే 15 సంవత్సరాలు…

Read More

వివాహ వేడుకల్లో ఆదిత్యరెడ్డి…నవ దంపతులకు ఆశీస్సుల.!

నిత్యం ప్రజల మధ్య ఉంటూ…. ప్రజల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ప్రాధాన్యతనిచ్చే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి బుధవారం పాటి గ్రామంలోని రామా సంజీవరెడ్డి గార్డెన్‌లో జరిగిన పవన్, ప్రీతిల వివాహానికి, అలాగే గాయత్రి గార్డెన్‌లో జరిగిన కిరణ్, పల్లవిల పెళ్లి వేడుకకు ఆయన స్వయంగా హాజరయ్యారు. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తమ పిలుపు మేరకు విచ్చేసిన ఆదిత్యరెడ్డి గారికి ఇరు కుటుంబ సభ్యులు ప్రత్యేక…

Read More

రంజాన్ సందర్భంగా ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరణ

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను గురువారం తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం త్యాగం, సహనం, ఆత్మ నియంత్రణతో పాటు దైవభక్తిని ప్రజల్లో మరింత లోతుగా నాటే పవిత్ర కాలమని తెలిపారు. ముస్లిం సోదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, సమిష్టిగా చేసే ప్రార్థనలు సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ నగర్‌కు చెందిన…

Read More

గిరిజనుల గౌరవాన్ని చాటిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్ కేసీఆర్ నగర్‌లో ఘనంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో తెల్లాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్, మల్లేపల్లి రాహుల్ రెడ్డి, ఇంద్రా రెడ్డి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, కిశోర్,…

Read More

నూతన కమిటీకి కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకుల అభినందనలు

97 బ్లాక్‌లో ఇటీవల జరిగిన ఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రెసిడెంట్ పర్వీనా బేగమ్‌, వైస్ ప్రెసిడెంట్ నవీన్‌తో పాటు నూతన కమిటీ సభ్యులందరికీ కేసీఆర్ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మేకల మల్లేష్ యాదవ్, సిరాజ్, బిరాధర్ ఆంజనేయులు, పాండు, రాజ్ కిరణ్, సుధాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సొసైటీ అభివృద్ధి, నివాసితుల సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నూతన కమిటీ సమిష్టిగా కృషి…

Read More

గిరిజనుల ఆదర్శపురుషుడు సంత్ సేవాలాల్ మహారాజ్: సోమిరెడ్డి

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి గిరిజన సంక్షేమానికి ₹1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ 16 కోట్ల మంది గిరిజనుల ఆరాధ్య దైవం, ఆదర్శపురుషుడని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. గతంలో గిరిజనుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నాయని,…

Read More

చివరి రోజు హోరెత్తిన కాంగ్రెస్ ప్రచారం

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం…. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని బచ్చుగూడెం, ఐనోల్‌, రామేశ్వరంబండ, పెద్ద కంజర్ల, చిన్న కంజర్లలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా…

Read More
somireddy

సోమిరెడ్డి ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఎన్నికల ప్రచార సభ

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ… కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను నట్టేట ముంచుతోందని తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు…

Read More
GMR

గూడెం దారేటు?

బీఆర్ఎస్‌ పార్టీ సమావేశాలు రీ-ఎంట్రీకి సంకేతాలా..?గూడెం అధికారంగా ఎప్పుడు కండువా కప్పుకుంటారు? సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి గూడెం పేరు చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ఆయన రాజకీయ అడుగులు మాత్రం బీఆర్ఎస్ వైపే సాగుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిత్యం బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం, హరీష్ రావు శిష్యుడిగా గుర్తింపు ఉండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఇటీవల…

Read More