నిత్యం ప్రజల మధ్య ఉంటూ…. ప్రజల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ప్రాధాన్యతనిచ్చే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి బుధవారం పాటి గ్రామంలోని రామా సంజీవరెడ్డి గార్డెన్లో జరిగిన పవన్, ప్రీతిల వివాహానికి, అలాగే గాయత్రి గార్డెన్లో జరిగిన కిరణ్, పల్లవిల పెళ్లి వేడుకకు ఆయన స్వయంగా హాజరయ్యారు. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తమ పిలుపు మేరకు విచ్చేసిన ఆదిత్యరెడ్డి గారికి ఇరు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పటాన్చెరు ప్రజలు పాల్గొన్నారు.

