Published on: February 20, 2026 at 9:03 AM
రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను గురువారం తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం త్యాగం, సహనం, ఆత్మ నియంత్రణతో పాటు దైవభక్తిని ప్రజల్లో మరింత లోతుగా నాటే పవిత్ర కాలమని తెలిపారు. ముస్లిం సోదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, సమిష్టిగా చేసే ప్రార్థనలు సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ నగర్‌కు చెందిన నాయకులు షకీల్, ఇమ్రాన్, సిరాజ్, కోటేష్ నాయక్, మల్లేష్ యాదవ్, ఆంజనేయులు, మొయిన్ పాల్గొన్నారు.

