వెంటనే స్పందించి పాఠశాలకు వసతులు కల్పించాలి

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న కేసీఆర్ నగర్‌లో ఇప్పటికీ పాఠశాల భవనం లేకపోవడం ఆశ్చర్యకరమని వారు అంటున్నారు. సరైన భవనం, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించాలంటే వెంటనే స్పందించి పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *