Published on: February 3, 2026 at 8:50 PM
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్ -02లో తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పోషణ, గర్భిణీలు మరియు బాలింతలకు అవసరమైన సేవలు అందించేందుకు అంగన్వాడీ కేంద్రం ఎంతో కీలకమని పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

