Published on: February 15, 2026 at 8:52 AM
97 బ్లాక్‌లో ఇటీవల జరిగిన ఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రెసిడెంట్ పర్వీనా బేగమ్, వైస్ ప్రెసిడెంట్ నవీన్‌తో పాటు నూతన కమిటీ సభ్యులందరికీ కేసీఆర్ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మేకల మల్లేష్ యాదవ్, సిరాజ్, బిరాధర్ ఆంజనేయులు, పాండు, రాజ్ కిరణ్, సుధాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సొసైటీ అభివృద్ధి, నివాసితుల సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నూతన కమిటీ సమిష్టిగా కృషి చేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. నివాసితుల సమస్యలకు సత్వర పరిష్కారాలు అందిస్తూ, పారదర్శక పాలనతో సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని వారు సూచించారు.

