గిరిజనుల గౌరవాన్ని చాటిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్ కేసీఆర్ నగర్‌లో ఘనంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో తెల్లాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్, మల్లేపల్లి రాహుల్ రెడ్డి, ఇంద్రా రెడ్డి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, కిశోర్, మేకల మల్లేష్ యాదవ్, ఇమ్రాన్, సిరాజ్, పాండు, రవి తదితర నాయకులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. స్థానిక ప్రజలతో కలిసి సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం ఉత్సాహంగా, ఐక్యతను చాటే విధంగా సాగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *