గిరిజనుల ఆదర్శపురుషుడు సంత్ సేవాలాల్ మహారాజ్: సోమిరెడ్డి

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి గిరిజన సంక్షేమానికి ₹1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ 16 కోట్ల మంది గిరిజనుల ఆరాధ్య దైవం, ఆదర్శపురుషుడని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. గతంలో గిరిజనుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నాయని, అయితే కేసీఆర్ హయాంలోనే సంత్ సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాండు, కోటేష్ నాయక్, రవి, రఘు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *