Hyderabad |CP Sajjanar : నాంపల్లి ఎగ్జిబిషన్‌కు రావొద్దు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఈరోజు నుమాయిష్ (ఎగ్జిబిషన్) సందర్శనను వాయిదా వేసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలు ఎగ్జిబిషన్‌కు రావద్దని సీపీ సూచించారు. ట్రాఫిక్‌ను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
