పాఠశాలల్లోనే ఆధార్ నమోదు…బయోమెట్రిక్ అప్‌డేషన్ సౌకర్యం
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆధార్ వివరాల అప్‌డేషన్‌కు తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 2026 నాటికి 100 శాతం ఆధార్ నమోదు, అప్‌డేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పాఠశాలలలోనే ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేషన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు బయట కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్కూల్ ప్రాంగణంలోనే ఈ సేవలు పొందేలా చర్యలు చేపట్టారు. 5 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు, అలాగే 15 సంవత్సరాలు…
