Published on: January 30, 2026 at 7:25 AM
కేసీఆర్ నగర్‌లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్టూడెంట్స్‌కు కౌన్సెలింగ్ కమ్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. వెంకటేశ్వర్ రెడ్డి, సర్టిఫైడ్ అకడమిక్ ట్రైనర్‌గా పాల్గొని గురువారం రోజున విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి సరైన కెరీర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో లక్ష్య నిర్ధారణ, ప్రణాళికాబద్ధమైన చదువు, నైపుణ్యాభివృద్ధి ఎంతగానో అవసరమని వివరించారు.

