Published on: March 23, 2026 at 9:02 AM
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు చల్లని నీరు అందించేందుకు ఈ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు ఉమేష్, నాగరాజు మరియు హర్ష, సాయి చరణ్ గౌడ్, కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

