ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఇఫ్తార్ వేడుకలు

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఈద్గా ప్రాంగణంలో పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించి, ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ…. రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీక అని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ఐక్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్, పృథ్వి రాజ్, మాణిక్ యాదవ్, బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *