సోమిరెడ్డి ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఎన్నికల ప్రచార సభ

somireddy

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ… కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను నట్టేట ముంచుతోందని తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, ఇప్పుడు పురుషులపై భారం మోపుతూ బస్సు చార్జీలు పెంచారని గుర్తుచేశారు. ప్రజల్ని మభ్యపెట్టే మాయమాటలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ యాదవ్, బిరాదర్ ఆంజనేయులు, కోటేష్ నాయక్, ఇర్ఫాన్, గోపి, జనార్దన్ రెడ్డి, అక్రమ్ తదితరులు హాజరై సభను విజయవంతం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *