రామేశ్వరం బండలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం….

ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ ప్రాంతంలో 6, 7, 9 వార్డుల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *