పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు…బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సౌకర్యం

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆధార్‌ వివరాల అప్‌డేషన్‌కు తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్‌ 2026 నాటికి 100 శాతం ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పాఠశాలలలోనే ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు బయట కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్కూల్‌ ప్రాంగణంలోనే ఈ సేవలు పొందేలా చర్యలు చేపట్టారు.

5 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు, అలాగే 15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ తప్పనిసరి అని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆధార్‌ వివరాలు సరిగ్గా అప్‌డేట్‌ కాకపోతే ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, విద్యాసంబంధిత సేవల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కార్యక్రమాన్ని UIDAI సమన్వయంతో అమలు చేస్తుండగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించి విద్యార్థుల ఆధార్‌ అప్‌డేషన్‌ను సకాలంలో పూర్తిచేయాలని విద్యాశాఖ కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *