పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్….

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరిస్థితుల కారణంగా తాను అప్పట్లో తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే తన రాజకీయ జీవితం మొత్తంలో బీఆర్ఎస్‌తోనే అనుబంధం కొనసాగిందని స్పష్టం చేశారు. మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆశీస్సులతో సేవ చేసే అవకాశం లభించిందని గుర్తు చేశారు. పటాన్‌చెరు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, రానున్న ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం అందించాలని కార్యకర్తలకు సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *