తెలంగాణలో ‘కామన్ బిల్’కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచే దిశగా ‘కామన్ బిల్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలపై అదనపు భారం మోపకుండా, పాలనను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని తొలి దశలో GHMC పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అమలవుతున్న విధానాన్ని అనుసరిస్తూ, నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్నును ఒకే బిల్లుగా చెల్లించే అవకాశం కల్పించనున్నారు. ‘కామన్ బిల్’ అమలుతో బిల్లుల చెల్లింపులు సులభమవుతాయని, స్థానిక సంస్థల ఆదాయం మరింత పారదర్శకంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియను మరింత సులభం చేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *