Published on: January 22, 2026 at 9:19 PM
గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీపై విద్యుత్ బకాయిల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు బకాయిలుగా ఉన్న మొత్తంలో మూడు వారాల్లో రూ.54 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం రూ.118 కోట్ల బకాయిలపై కఠినంగా స్పందించిన హైకోర్టు, గడువు లోపు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.
