అభివృద్ధే అజెండా.. ఇస్నాపూర్‌లో బీఆర్ఎస్ (BRS) ప్రచారం

పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్‌కుల్, లక్డారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాణిక్ రెడ్డి, తెల్లాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, యువజన నాయకుడు మేరాజ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు శ్రీశైలం యాదవ్, రవీందర్ రెడ్డి, నాగరాజు, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *