
తెల్లాపూర్ కార్పొరేషన్ కేసీఆర్ నగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ నగర్‌లోని మెయిన్ గేట్, ఆటో యూనియన్ మరియు వివిధ బ్లాక్స్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో మల్లేపల్లి సోమిరెడ్డి మాట్లాడుతూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి భారతీయుడు పునఃస్మరించుకునే రోజు అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకొని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి హయాంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని పేర్కొంటూ, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్ గారు, దేవేందర్ యాదవ్ గారు, బుచ్చి రెడ్డి గారు, నాగరాజు, లచ్చి నాయక్, ఉమేష్, మాజీ కౌన్సిలర్స్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ నగర్ ప్రజలు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు.

