Published on: January 22, 2026 at 7:57 AM

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరిమెళ్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న AR BCVR ట్రావెల్స్‌కు చెందిన బస్సు, టైరు అకస్మాత్తుగా పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు లారీ డ్రైవర్, లారీ క్లీనర్‌తో పాటు బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

