నేడే లాస్ట్ డేట్…
దేశసేవతో పాటు ఉన్నత విద్య..
నేవీ నుంచి అరుదైన అవకాశం…!

నేడే లాస్ట్ డేట్…
దేశసేవతో పాటు ఉన్నత విద్య..
నేవీ నుంచి అరుదైన అవకాశం…!

భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మక 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఒకవైపు గౌరవప్రదమైన నేవీ ఆఫీసర్ ఉద్యోగం, మరోవైపు ఉచిత బీటెక్ డిగ్రీ అందించనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, JEE మెయిన్స్ ర్యాంక్ కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 44 ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుండగా, అందులో మహిళలకు గరిష్టంగా 7 సీట్లు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ పొందుతూ, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో బీటెక్ కోర్సు పూర్తి చేస్తారు. శిక్షణ అనంతరం ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్లుగా నియామకం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఈ నెల 19
అర్హత: 10+2 (PCM), JEE మెయిన్స్ ర్యాంక్ తప్పనిసరి

Source: joinindiannavy.gov.in

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *